byసూర్య | Fri, Feb 23, 2024, 03:54 PM
భిక్కనూరు మండలంలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో గురువారం షెడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. మండలంలోని అంతంపల్లి గ్రామ సహకార సంఘం ఆధ్వర్యంలో షెడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని సొసైటీ అధ్యక్షులు వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ, రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు షెడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.