ఎమ్మెల్యే లాస్య భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

byసూర్య | Fri, Feb 23, 2024, 01:53 PM

ఎమ్మెల్యే లాస్య నందిత ఇంటికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. హైదరాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్ లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాస్య భౌతికకాయానికి నివాళులర్పించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హారీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.
అయితే ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఓఆర్ఆర్‌పై రెయిలింగ్‌ను ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అంతా భావించారు. అయితే, వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొని 100 మీటర్ల దూరం లాక్కిళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. కారును ఢీకొన్న లారీ ఆగకుండా వెళ్లిపోయింది. లారీని ఓవర్ టేక్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురై రెయిలింగ్‌ను ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) మృతి చెందారు. పటాన్చెరు ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టింది. 


Latest News
 

బండి సంజయ్‌ ఆస్తుల లెక్క ఇదే.. కిషన్ రెడ్డి ఇప్పటికీ ఆ కారే వాడుతున్నారు Sat, Apr 20, 2024, 09:31 PM
తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. నేటి నుంచి మూడ్రోజులు వర్షాలు Sat, Apr 20, 2024, 09:26 PM
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆస్తులెన్నో తెలుసా..? అదే ఆయన ప్రధాన ఆదాయ వనరు Sat, Apr 20, 2024, 09:19 PM
కుమారుడిపై కేసు భయం.. తల్లి సూసైడ్, ఎంత విషాదం Sat, Apr 20, 2024, 09:10 PM
మామిడి చెట్టెక్కి మరీ,,,,మంత్రి జూపల్లి వెరైటీ ప్రచారం Sat, Apr 20, 2024, 09:06 PM