|
|
byసూర్య | Fri, Feb 23, 2024, 01:18 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పీఏ/డ్రైవర్ ఆకాశ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అయితే, అతడిని ఏం అడిగినా.. తనకేం గుర్తులేదంటున్నాడని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.