అధికార లాంఛనాలతో ఎమ్మెల్యే లాస్య అంత్యక్రియలు

byసూర్య | Fri, Feb 23, 2024, 12:31 PM

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఓఆర్ఆర్‌పై రెయిలింగ్‌ను ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అంతా భావించారు. అయితే, వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొని 100 మీటర్ల దూరం లాక్కిళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. కారును ఢీకొన్న లారీ ఆగకుండా వెళ్లిపోయింది. లారీని ఓవర్ టేక్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురై రెయిలింగ్‌ను ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) మృతి చెందారు. పటాన్చెరు ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టింది. 


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM