మేడారం భక్తుల కోసం 'మెుబైల్ యాప్'.. అరచేతిలో జాతర సమాచారం, డౌన్‌లోడ్ చేసుకోండి

byసూర్య | Tue, Feb 20, 2024, 07:32 PM

తెలంగాణ కుంభమేళా, రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులకు రోజు రోజుకూ సౌకర్యాలు మెరుగు పడుతున్నాయి. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం 'మై మేడారం యాప్‌'ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే జాతరలో కల్పిస్తున్న మౌలిక వసతులు, ముఖ్య ఘట్టాల సమాచారాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారు.


స్మార్ట్‌ఫోన్‌లోని ప్లే స్టోర్‌లోకి వెళ్లి దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇంటర్నెట్ అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లోనూ మేడారం సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు. జాతరకు వచ్చే భక్తులకు ఇదొక వర ప్రసాదం. భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకూడదని దీనిని తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లోనూ రూపొందించారు. 'మై మేడారం' యాప్‌కు తోడు 'టీఎస్‌ఆర్టీసీ మేడారం జాతర', 'మేడారం పోలీస్‌ 2024' యాప్‌లను సైతం అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ, పోలీసు సేవల సమాచారం ఆ యూప్‌లలో సమగ్రంగా ఉంటుంది.


మై మేడారం యాప్‌లో జాతరలో ఏర్పాటు చేసిన అన్ని సౌకర్యాలు, వాటి స్థానాల వివరాలు ఉంటాయి. దీనికి తోడు జాతరలో ఎవరైనా తప్పిపోయిన వారిని వెతికే సౌకర్యం కూడా యాప్‌లో ఉంది. ఈ యాప్‌లో సమ్మక్క- సారక్క జాతర, తాగునీటి పాయింట్లు, బోర్లు, కుళాయిలు, మరుగుదొడ్లు, పార్కింగ్, సహాయ కేంద్రాలు, వైద్య శిబిరాలు, టీఎస్‌ఆర్‌టీసీ బస్సు సర్వీసులకు సంబంధించిన సమాచారం ఉంటుంది.


ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ప్లేస్టోర్ నుంచి, ఐఫోన్ వినియోగదారుల కోసం యాప్ స్టోర్ నుండి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 18004250620 కూడా భక్తులకు అందుబాటులో ఉంటుంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి, భక్తులకు వైద్య సహాయం అందించేందుకు 40 బైక్ అంబులెన్స్‌లు కూడా సైట్‌లో అందుబాటులో ఉంటాయి.


జాతరకు 6 వేల స్పెషల్ బస్సులు..


మేడారం జాతర కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. మేడారంలో తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేయగా.. మంత్రి సీతక్క ఇటీవల ప్రారంభించారు. ఇక జాతరకు వెళ్లలేని భక్తుల కోసం టీఎస్ ఆర్టీసీ కార్గో సేవల ద్వారా ప్రసాదాన్ని ఇంటికే డెలివరీ చేస్తున్నారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM