"మై రాక్ స్టార్" అంటూ నటుడు ప్రకాశ్ రాజ్ కితాబు

byసూర్య | Sat, Dec 09, 2023, 08:25 PM

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. కేసీఆర్ "మై రాక్ స్టార్" అంటూ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం నాడు ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు రోజు క్రితం బాత్రూంలో కాలు జారి పడి, యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయనకు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అవనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందని వైద్యులు అన్నారు. ఈ నేపథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.



Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM