24 గంటల ఫ్రీ కరెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశం

byసూర్య | Sat, Dec 09, 2023, 08:20 PM

డిసెంబర్ 7న తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. తన మార్కు పాలన మెుదలుపెట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. శుక్రవారం కేబినెట్ భేటీ నిర్వహించిన సీఎం.. ఆ తర్వాత వివిధశాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వం మారినా తెలంగాణలో కరెంటు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని సీఎం రేవంత్.. ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఏ రకమైన తేడాల్లేకుండా ఇప్పుడున్నట్లుగానే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని అన్నారు.


కేబినెట్ తొలి సమావేశంలోనే విద్యుత్ రంగంపై జరిగిన చర్చకు కొనసాగింపుగా ఆ శాఖ అధికారులతో సచివాలయంలో శుక్రవారం (డిసెంబర్ 8న) ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ నిర్వహించారు రేవంత్. విద్యుత్ శాఖకు సంబంధించిన అనేక అంశాలపై ఈ మీటింగ్‌లో చర్చించారు. అధికారుల నుంచి వివరాలను తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న విధానాలనే ఇకపైనా కొనసాగించాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకూడదని అధికారులకు స్పష్టం చేశారు. సమీక్ష సందర్భంగా ఛత్తీస్‌గఢ్ నుంచి కొంటున్న విద్యుత్‌పైనా.. అధికారుల నుంచి పలు వివరాలను సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం ఆ శాఖ ఆర్థిక పరిస్థితితో పాటు రానున్న రోజుల్లో సమకూర్చుకోవాల్సిన వనరులు, చేపట్టాల్సిన చర్యలపైనా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.


రాష్ట్రమంతటా గృహ, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి ఆటంకాల్లేకుండా కొనసాగాలన్నదే తమ ప్రభుత్వ విధానమని, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి శాఖ పూర్తిస్థాయిలో సమాయత్తమై సహకారం అందించాలని అధికారులకు సూచించారు. ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. ఇక ఈ సమావేశానికి ట్రాన్స్ కో – జెన్ కో సీఎండీ దేవుపల్లి ప్రభాకర్‌రావు హాజరుకావాల్సిందిగా క్యాబినెట్ భేటీ సందర్భంగానే విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేసినా.. ఆయన రివ్యూ మీటింగుకు హాజరు కాలేదు. మరోవైపు తనకు సీఎంవో నుంచిగానీ, శాఖ అధికారుల నుంచిగానీ ఎలాంటి సమాచారం రాలేదని, ముఖ్యమంత్రి నుంచి లేదా ప్రభుత్వం నుంచి సమాచారం వస్తే హాజరుకాకుండా ఎందుకుంటానని ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా హాజరుకావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మీడియా ప్రతినిధులతో అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM