బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్,,,,ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు

byసూర్య | Sat, Dec 09, 2023, 07:09 PM

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభపక్ష నేతగా.. మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్‌ఎస్‌పీ నేత కేశవరావు అధ్యక్షతన తెలంగాణ భవన్‍లో జరిగిన సమావేశంలో.. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పేరును ప్రతిపాదించారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి కేసీఆర్‌ను బలపరిచారు. శాసనసభాపక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే భాద్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనతంరం ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరారు.


ఇక కేసీఆర్‌కు యశోద ఆస్పత్రికి చెందిన ప్రత్యేత వైద్య బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో శుక్రవారం వేకువఝామున 3 గంటల సమయంలో కాలు జారి పడటంతో.. ఆయన తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. దీంతో.. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆయన తుంటి ఎముక విరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులైన కేటీఆర్, కవిత ఆంగీకారంతో.. కేసీఆర్‌ తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్‌ను ప్రత్యేక వైద్య బృందం సక్సెస్ చేసింది. అయితే.. ఈ సర్జరీ నంచి కేసీఆర్ పూర్తిగా కోలుకోటానికి 6 నుంచి 8 వారాల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు.


Latest News
 

అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM
ఎమ్మెల్యే కాంతారావు కు ఫోటో ఫ్రెమ్ అందజేసిన నాయకులు Fri, Sep 20, 2024, 03:59 PM
కుటుంబ కలహాలతో కూతురుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య Fri, Sep 20, 2024, 03:57 PM
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి Fri, Sep 20, 2024, 03:57 PM