మరో ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో కేసీఆర్

byసూర్య | Sat, Dec 09, 2023, 12:07 PM

మాజీ సీఎం కేసీఆర్‌ గురువారం బాత్‌రూమ్‌లో జారిపడటంతో ఎడమ తుంటికి గాయమైంది. దీంతో కేసీఆర్‌ను ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. దీంతో కేసీఆర్ కు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు నిన్న తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
నిన్న సాయంత్రం నాలుగు గంటలకు పైగా కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేసిన యశోద ఆస్పత్రి వైద్యులు.. మేజర్ సర్జరీ కావడంతో మరింత పర్యవేక్షణ అవసరమని చెప్పారు. ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ తో మందులను కొనసాగిస్తున్నామని.. వైద్యుల పర్యవేక్షణలో సాధారణ డైట్ పాటిస్తున్నామని చెప్పారు. కాస్త కోలుకున్న తర్వాత నడవడానికి ప్రయత్నిస్తాడు.. ఫిజియోథెరపీ కూడా నిర్వహిస్తాడు.. ఇంకా 5 రోజుల వరకు ఆస్పత్రి లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తోంది.. రికవరీకి సాధారణంగా ఆరు నుండి ఎనిమిది వారాల వరకు సమయం పడుతుంది.. సీనియర్ సిటిజన్ కావడంతో సాధారణ స్థితిలోకి వచ్చి నడిచేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది అని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM