సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు: ఎమ్మెల్యే వివేక్‌

byసూర్య | Sat, Dec 09, 2023, 12:09 PM

సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామ‌ని చెన్నూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి చెప్పారు. శ‌నివారం తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమైంద‌ని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింద‌ని, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తామ‌ని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఉదయం 11 గంటల తర్వాత అసెంబ్లీలో కొత్తగా నియమితులైన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్బరుద్దీన్‌ అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM