అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

byసూర్య | Sat, Dec 09, 2023, 11:44 AM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఉదయం 11 గంటల తర్వాత అసెంబ్లీలో కొత్తగా నియమితులైన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్బరుద్దీన్‌ అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించారు.
తేలంగాణ‌లో మంత్రుల‌కు శాఖ‌లను కేటాయించారు. వివ‌రాలు ఇలా..
* భట్టి విక్రమార్క - ఆర్థిక, ఇంధన శాఖ
* తుమ్మల నాగేశ్వరరావు - వ్యవసాయం, చేనేత
* జూపల్లి కృష్ణారావు - ఎక్సైజ్‌, పర్యాటక శాఖ‌
* ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ‌
* దామోదర రాజనర్సింహ - వైద్య, ఆరోగ్య శాఖ
* కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ
* దుద్దిళ్ల శ్రీధర్‌బాబు - ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు
* పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
* పొన్నం ప్రభాకర్‌ - రవాణా, బీసీ సంక్షేమం
* సీతక్క - పంచాయతీ రాజ్‌, మహిళ, శిశు సంక్షేమం
* కొండాసురేఖ - అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ


Latest News
 

స‌త్యం కంప్యూట‌ర్స్ అధినేత రామ‌లింగ‌రాజును ఆహ్వానించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి Fri, Oct 11, 2024, 10:47 AM
విమానంలో మహిళకు వేధింపులు.. Fri, Oct 11, 2024, 10:40 AM
వనపర్తి జిల్లాను 100% అక్షరాస్యులుగా మార్చాలి: కలెక్టర్ Fri, Oct 11, 2024, 10:29 AM
కల్లు తాగితే కిడ్నీలో రాళ్లకు చెక్ Fri, Oct 11, 2024, 10:20 AM
హైదరాబాద్‌లో భారీవర్షం.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు Thu, Oct 10, 2024, 09:51 PM