రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ సీఎం,,,,పరస్పర సహకారం కోరుకుంటున్న టీఎస్ సీఎం ట్వీట్

byసూర్య | Fri, Dec 08, 2023, 07:37 PM

తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. తనకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్‌కు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం…అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తమ ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని ఆయన అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం… అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం.. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ ‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, ఇతర మంత్రులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. మరోవైపు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం రేవంత్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి విజయవంతంగా పాలన సాగించాలని ఆకాంక్షించారు నారాలోకేష్.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM