ప్రజాదర్బార్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

byసూర్య | Fri, Dec 08, 2023, 07:26 PM

తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సర్కారు ఏర్పాటైన రెండు రోజుల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుని అధికారులకు పరుగులు పెట్టిస్తున్నారు. సర్కారు కొలువుదీరిన మొదటిరోజే మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు. అందులో రెండు గ్యారెంటీలను డిసెంబర్ 9 నుంచి అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. జోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించి.. అందరి చేత దటీజ్ రేవంత్ అనిపించుకున్నారు. ప్రజా దర్భార్‌ మొదటి రోజున సామాన్యుల నుంచి నేరుగా అర్జీలను అందుకున్నారు సీఎం రేవంత్. వాళ్లు చెప్పే సమస్యలను ఓపిగ్గా వింటూ.. వారికి హామీలు ఇచ్చి పంపించారు.


కాసేపటి తర్వాత సీఎం సెక్రటేరియట్‌కు వెళ్లిపోవటంతో.. తర్వాత మంత్రి సీతక్క ప్రజల దగ్గరి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అయితే.. మొదటి ప్రజాదర్భార్ కావటంతో.. ప్రజాభవన్‌కు పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కట్టారు. దీంతో.. వాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులకు కొంత తలనొప్పిగా మారింది. అయితే.. ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించగా.. దీని నిర్వాహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాదర్బార్‌కు ఊహకు మించి ఆదరన లభిస్తోంది. అంచనాలకు మించి ఫిర్యాదులు, వినతి పత్రాలు వస్తుండటంతో.. ఇకపై ప్రజాదర్బార్‌ను కట్టుదిట్టంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాకొక అధికారిని నియమించాలని.. వచ్చిన ఫిర్యాదులు, వినతి పత్రాల పర్యావేక్షణ బాధ్యతలు ఓ సీనియర్ అధికారికి అప్పగించాలన్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు.. ప్రజాదర్బార్‌లో రోజుకు ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఉండేలా ఆదేశించనున్నట్టు తెలుస్తోంది.


కేసీఆర్ పాలనలో ప్రగతి భవన్‌ ఓ గడీలా మారిపోయిందని.. మంత్రులకు కూడా సీఎం అపాయింట్ మెంట్ దొరకకుండా చేసేశారంటూ రేవంత్ రెడ్డి చాలా సార్లు విమర్శించిన విషయం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ సర్కారులో ప్రగితభవన్ గడీలు బద్దలుకొడతామని చాలాసార్లు పేర్కొన్నారు. అన్నట్టుగానే.. అటు కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరుతున్న సమయంలోనే.. ఇటు ప్రగతిభవన్ ముందున్న కంచెను బద్దలు కొట్టించారు సీఎం రేవంత్ రెడ్డి.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM