మల్కాజిగిరి ఎమ్మెల్యే ఫోన్ నెంబర్‌తో బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు కాల్ప్,,,నెంబరు హ్యాక్ చేసినట్టు అనుమానం

byసూర్య | Fri, Dec 08, 2023, 07:17 PM

మల్కాజిగిరి బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేగుతోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మొబైల్ ఫోన్ నెంబర్‌తో కాల్స్ రావడంతో బాధితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఉపయోంచి ఎమ్మెల్యే పేరుతో కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టు మల్కాజిగిరి, నేరెడ్మెట్, అల్వాల్ పోలీస్ స్టేషన్‌లలో పలువురు ఫిర్యాదులు చేశారు. బెదిరింపు కాల్స్ అందుకున్న వారిలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, నేరెడ్‌మెట్ కార్పొరేటర్ భర్త ఉపేందర్ రెడ్డి, గౌతమ్ నగర్ కార్పొరేటర్ భర్త రాము యాదవ్, మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఇతర ముఖ్య బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారంతా స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


అయితే, కాంగ్రెస్ నుంచి పోటీచేసిన మైనంపల్లి హన్మంతరావు ఓటమి చెందడంతో ఆయన అనుచరులే ఈ బెదిరింపు కాల్స్ చేసి తమ అంతు చూస్తామని బెదిరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మల్కాజిగిరి, నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా తన ఫోన్ హ్యాకైనట్టు ఆరోపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజేశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లిపై విజయం సాధించారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM