రెండు సబ్‌స్టేషన్ల నుంచి సరఫరా ..

byసూర్య | Thu, Dec 07, 2023, 11:28 AM

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా గురువారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయన ఇల్లు, కార్యాలయం, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విద్యుత్తు సరఫరా తదితర అంశాలపై విద్యుత్తుశాఖ సమీక్షించింది.సరఫరాలో అంతరాయం తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజినీర్లను ఆదేశించింది. రేవంత్‌రెడ్డి ఇంటికి గతంలో జూబ్లీహిల్స్‌ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్తు సరఫరా అయ్యేది. ఆ వ్యవస్థలో సమస్య తలెత్తినా సరఫరా ఆగకుండా చూసే క్రమంలో ఇంజినీర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రోడ్‌ నంబరు 22లోని సబ్‌స్టేషన్‌ నుంచీ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టారు. ఆయా పనులు బుధవారం నాటికి పూర్తయ్యాయి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో విద్యుత్తు సరఫరాపైనా కార్పొరేట్‌ కార్యాలయం బుధవారం సమీక్షించింది. సీఎంగా కేసీఆర్‌ ఉన్నప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్‌ తరహాలో కొడంగల్‌ నియోజకవర్గంలోనూ సరఫరా మెరుగ్గా ఉండాలని ఉన్నతాధికారులు సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు.


 


 


Latest News
 

మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM
జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM
స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క Fri, Oct 18, 2024, 04:44 PM
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది Fri, Oct 18, 2024, 04:42 PM
రేపు ఉదయం తొమ్మిది గంటలకు మూసీ పరీవాహక ప్రాంతం వద్దకు వెళ్దామన్న హరీశ్ రావు Fri, Oct 18, 2024, 04:41 PM