కాంగ్రెసోళ్ల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయ్.. కేటీఆర్

byసూర్య | Wed, Dec 06, 2023, 08:43 PM

పవర్ పాలిటిక్స్‌లో గెలుపోటములు సహజమని.. ఓడిపోయామని బాధపడాల్సిన, భయపడాల్సిన పరిస్థితి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సిరిసిల్లలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడిన కేటీఆర్.. వారికి ధైర్యం చెప్పారు. సిరిసిల్ల నుంచి సుమారు 30 వేల ఓట్ల మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఎవరెన్ని రకాలుగా ప్రలోభాలు, కుట్రలు చేసినప్పటికీ సిరిసిల్ల ప్రజలు మాత్రం అభివృద్ధికే పట్టం కట్టారని అభిప్రాయపడ్డారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమన్న కేటీఆర్.. నిరాశ పడాల్సిన అవసరం లేదని కార్యకర్తలలో ధైర్యం నూరిపోశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు. ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీకి పోరాటాలు చేయడం కొత్తేమీ కాదన్న కేటీఆర్.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన ప్రజాగొంతుకై పోరాడుదామని కార్యకర్తలకు నిర్దేశించారు. ప్రజలు మనకు రెండుసార్లు ఛాన్స్ ఇచ్చారని, ఇది తాత్కాళిక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని అభిప్రాయపడ్డారు.


మరోవైపు తెలంగాణలో కేసీఆర్ సర్కారు పోయిందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరనే నిరాశలో కాంగ్రెస్ ఓటర్లు కూడా ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత మూడు రోజులనుంచి ఇలాంటి సందేశాలు, వీడియోలు వస్తున్నాయని కార్యకర్తలకు వివరించారు. ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదని.. బాధ్యతాయుత విపక్షంగా పనిచేద్దామని అన్నారు. తెలంగాణ ప్రజలు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారన్న కేటీఆర్.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం వారితో కలిసి పోరాడుతామని తెలిపారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్‌గా అభివర్ణించిన కేటీఆర్.. తెలంగాణ ప్రజానీకం తమను వదులుకోదని విశ్వాసం వ్యక్తం చేశారు.అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అన్నింటినీ తెలంగాణ ప్రజలు రాసిపెట్టుకున్నారన్న కేటీఆర్.. అన్నింటినీ గమనిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని గెలుపొందడం ఎంతో దూరంలో లేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు సిరిసిల్లలో ఓటర్లకు డబ్బులు, మందులు పంచనని మాట ఇచ్చానన్న కేటీఆర్.. ఆ మాటను నిలబెట్టుకున్నానని అన్నారు. ప్రజలు కూడా తనను గెలిపించి విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ప్రజల హక్కుల కోసం కొట్లాడుతానని వెల్లడించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM