రహదారులు దెబ్బతినే పక్షంలో వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలి : రేవంత్

byసూర్య | Wed, Dec 06, 2023, 04:03 PM

మిగ్‌ జాం తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఓ ప్రకటనలో సూచించారు.లోతట్టు, ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 'పలు ప్రాంతాల్లో కుప్పపోసిన ధాన్యం తడిసిపోయే అవకాశం ఉందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టిపెట్టాలి. ఎక్కడికక్కడ రైతులకు అండగా నిలిచి అవసరమైన సహాయ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి.


ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, యాదాద్రి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. భారీ వర్ష సూచన ఉన్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేయాలి. పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ఆహారం, సురక్షిత నీరు అందేలా చూడాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. విద్యుత్‌, రహదారులు దెబ్బతినే పక్షంలో వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలి'' అని రేవంత్‌రెడ్డి ఆ ప్రకటనలో సూచనలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లను మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కోరారు.


 


 


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM