రేవంత్ రెడ్డికి షాక్ తప్పదా?

byసూర్య | Tue, Dec 05, 2023, 12:13 PM

తెలంగాణ సీఎం ఎంపిక పై ఉత్కంఠ నెలకొంది. సీఎల్పీ మీటింగ్ లో 47 మంది ఎమ్మెల్యేలు రేవంత్ కు మద్దతు తెలిపినట్టు సమాచారం. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తమ పేర్లను పరిశీలించాలని హైకమాండ్ ను కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను సీఎం చేయాలని గట్టిగా కోరుతునట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వకుంటే పెద్ద షాక్ తగలనుందని చర్చ జరుగుతోంది.
తెలంగాణ సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఈ విషయంపై ఏఐసీసీ AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. 'సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తాం. ఇవాళే సీఎం పేరును ప్రకటిస్తాం' అని వెల్లడించారు. కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్, భట్టి.. మధ్యాహ్నం ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత సీఎం అభ్యర్థిపై క్లారిటీ రానుంది.
మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఖర్గేతో డీకేఎస్‌ భేటీకి ముందు భట్టి, ఉత్తమ్‌లు డీకేఎస్‌తో సమావేశమై సీఎం, మంత్రివర్గ కూర్పుపై తమ వాదనలు బలంగా వినిపించనున్నట్లు తెలుస్తోంది.


Latest News
 

హైదరాబాద్‌లో 10 వేల మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు Sun, Sep 22, 2024, 07:26 PM
హైదరాబాద్‌లో భారీ చోరీ.. రూ.2 కోట్లకు పైగా అపహరణ Sun, Sep 22, 2024, 07:24 PM
ఫేమస్ అయ్యేందుకు కుమారుడితో ప్రమాకర స్టంట్,,,,వీడియో షేర్ చేసిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ Sun, Sep 22, 2024, 07:23 PM
సిడిపి పనుల స్థితిగతుల పై నివేదిక అందించాలి Sun, Sep 22, 2024, 07:21 PM
తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఏపీ ఎంపీ భారీ విరాళం Sun, Sep 22, 2024, 07:21 PM