ఫేమస్ అయ్యేందుకు కుమారుడితో ప్రమాకర స్టంట్,,,,వీడియో షేర్ చేసిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్

byసూర్య | Sun, Sep 22, 2024, 07:23 PM

ఇది స్మార్ట్ ఫోన్ యుగం. అరచేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను పిచ్చ పిచ్చగా వాడేస్తున్నారు. కొందరు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటే.. మరికొంతమంది ఫేమస్ అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఫేమస్ అవ్వాలి అనే వెర్రి ఆలోచన తప్ప.. మరొకటి లేకుండా పోతుంది. అందుకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఫేమస్ అయ్యేందుకు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. పిచ్చి ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. ఇతరుల ప్రాణాలకు కూడా హానీ కలిగిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ మహిళ ఫేమస్ అయ్యేందుకు చిన్నారి ప్రాణాన్ని ఫణంగా పెట్టింది. ఆ వీడియాను షేర్ చేసిన టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇటువంటి వెర్రి చేష్టలు వేయవద్దని సూచించారు.


వివరాల్లోకి వెళితే.. . ఓ తల్లి సోషల్ మీడియా రీల్స్ మోజులో పడి తన కన్నబిడ్డతో ప్రమాదకంగా స్టంట్స్ చేస్తుంది. పాడుబడ్డ బావి అంచున కూర్చొని.. చిన్న పిల్లవాడితో రీల్స్ చేసింది. చిన్నారిని పూర్తిగా బావిలోకి వదిలి ఓ చేతితో పట్టుకొని ప్రమాదకరంగా రీల్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రీల్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక తల్లిగా ఇటువంటి రీల్స్ చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోను ఎక్స్ వేదికగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పోస్ట్ చేశారు. 'ఇదెక్కడి పిచ్చి. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్‌లో పెట్టడం ఎంతవరకు సమంజసం. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదు. సోషల్ మీడియాకు బానిసలు కాకండి. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి.' అని ట్వీట్ చేశారు.


సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సజ్జనార్.. ఎప్పటికప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యలతో పాటుగా.. సామాజిక అంశాలను షేర్ చేస్తూ ఉంటారు. సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతుంటారు. ఇటువంటి రీల్స్ షేర్ చేసి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉంటారు.


Latest News
 

ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, జాగ్రత్తగా ఉండండి Sun, Sep 22, 2024, 07:57 PM
హైదరాబాద్ శివారులో గ్రీన్ ఫార్మా సిటీ.. హైకోర్టుకు ప్రభుత్వం కీలక నివేదిక Sun, Sep 22, 2024, 07:55 PM