తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఏపీ ఎంపీ భారీ విరాళం

byసూర్య | Sun, Sep 22, 2024, 07:21 PM

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ వర్షాలు, వరదల్లో ప్రాణనష్టంతో పాటుగా భారీగా ఆస్తి, పంట నష్టం కూడా సంభవించింది. ఇక వరదల కారణంగా నిరాశ్రయులైన వారెందరో. ఇలాంటి వారికి అండగా నిలుస్తున్నారు పలువురు దాతలు. వరద బాధితులకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు సమర్పిస్తూ తమ వంతు సాయం చేస్తున్నారు. దీంతో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, ఇటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీడీపీ ఎంపీ శ్రీభరత్ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందించారు. తెలంగాణలోని వరద బాధితులకు గీతం యూనివర్సిటీ తరుఫున వర్సిటీ ప్రెసిడెంట్ హోదాలో భరత్ ఈ విరాళం అందించారు, ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి విరాళం తాలూకు చెక్ అందజేశారు.


మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి సైతం విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ విరాళం అందించారు. ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడును కలిసి గీతం వర్సిటీ తరుఫున కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. వరదల సమయంలోనూ బాధితులను ఆదుకునేందుకు గీతం వర్సిటీ పనిచేసింది. బాధితుల ఆకలి తీర్చేందుకు ఆహారం పొట్లాలు పంపిణీ చేశారు. తాజాగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కోటి రూపాయలు చొప్పున విరాళాలు అందజేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీలో విజయవాడ అతలాకుతలం కాగా.. తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ములుగు జిల్లాలు ప్రభావితమయ్యాయి. ఈ జిల్లాలలో రైతులు, పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.


ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలుకు అండగా నిలిచేందుకు రంగాలకు అతీతంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, విద్యాసంస్థలు విరాళాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే గీతం వర్సిటీ విరాళం అందజేసింది. మరోవైపు వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 25న వరద సాయం బ్యాంకు అకౌంట్లలో జమచేయనుంది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. వరద బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం ఇటీవలే పరిహారం ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM