హస్తినలో కేసీఆర్ అధికారిక నివాసం ఖాళీ

byసూర్య | Tue, Dec 05, 2023, 11:57 AM

ఢిల్లీ తుగ్లక్ రోడ్ నెం.3లోని అధికారిక నివాసాన్ని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఖాళీ చేయనున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన దీనిని వినియోగించుకున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో ఆయనకు ఇక్కడ బంగ్లా కేటాయించారు. హస్తినలో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఇక్కడి నుంచే ఆయన నడిపారు. సీఎం అయ్యాక ఈ బంగ్లా ఆయన అధికారిక నివాసంగా కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత దానిని ప్రస్తుతం ఖాళీ చేస్తున్నారు.
తెలంగాణ సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఈ విషయంపై ఏఐసీసీ AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. 'సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తాం. ఇవాళే సీఎం పేరును ప్రకటిస్తాం' అని వెల్లడించారు. కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్, భట్టి.. మధ్యాహ్నం ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత సీఎం అభ్యర్థిపై క్లారిటీ రానుంది.
మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఖర్గేతో డీకేఎస్‌ భేటీకి ముందు భట్టి, ఉత్తమ్‌లు డీకేఎస్‌తో సమావేశమై సీఎం, మంత్రివర్గ కూర్పుపై తమ వాదనలు బలంగా వినిపించనున్నట్లు తెలుస్తోంది.


Latest News
 

నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM