ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. ఇక ట్రోల్స్ చేసుకోండి: ప్రకాష్ రాజ్

byసూర్య | Mon, Dec 04, 2023, 09:24 PM

తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు ప్రముఖులు స్పందించారు. విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అదే సమయంలో పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్ర వేసిన కేసీఆర్‌కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ, హీరోలు సందీప్‌ కిషన్‌, నిఖిల్, యాంకర్ అనసూయ.. కేటీఆర్‌కు మద్దతుగా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలో విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ కూడా స్పందించారు. ఎప్పట్లాగే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


‘ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. కాంగ్రెస్‌కు కంగ్రాట్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ థింగ్.. కేసీఆర్ గారు, కేటీఆర్. మీ గుండె ఎప్పుడూ తెలంగాణ కోసమే కొట్టుకుంటుందని మాకు తెలుసు. మేం మీ వెంటే ఉంటాం. ఇది కూడా గడిచిపోతుందని తెలుసు. కానీ, చాలా బాధ కలిగించింది’ అని ప్రకాష్ రాజ్ పోస్టు చేశారు. ‘ట్రోల్స్‌కు స్వాగతం’ అంటూ చివర్లో చేసిన డేరింగ్ కామెంట్ మరింత ఆసక్తికరంగా మారింది. ‘గెలిస్తే పొంగేది లేదు.. ఓడితే కుంగేది లేదు’ అనే క్యాప్షన్ రాసి ఉన్న పోస్టర్‌ను షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఈ కామెంట్లు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన ప్రకాష్ రాజ్.. గతంలో కర్ణాటకలో కేసీఆర్ పర్యటన సందర్భంగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడాన్ని ఆహ్వానించిన ప్రకాష్ రాజ్.. బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణ కోసం తనవంతు సహకారాన్ని అందించారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM