జనసేన ఊహించని షాక్.. అన్ని చోట్లా డిపాజిట్ గల్లంతు

byసూర్య | Sun, Dec 03, 2023, 01:46 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ అధికారంలోకి రావాలంటే 119 సీట్లలో 60 సీట్లు కావాలి. కాంగ్రెస్ ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కు దాదాపు 70 నుంచి 80 సీట్లు వస్తాయని అంచనాలు నిజమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ కి ఊహించని షాక్ తగిలింది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేసినా.. కనీసం ఒక్క సీటులో డిపాజిట్ కూడా దక్కలేదు. జనసేన అభ్యర్థులకు ఎక్కడా డిపాజిట్లు దక్కలేదు. కూకట్ పల్లిలో ప్రేమ్ కుమార్, తాండూరులో శంకర్ గౌడ్, నాగర్ కర్నూల్ లో లక్ష్మణ్ గౌడ్, కోదాడలో మేకల సతీష్ రెడ్డి, ఖమ్మంలో రామకృష్ణ, వైరాలో సంపత్ నాయక్, కొత్తగూడెంలో సురేందర్ రావు, అశ్వారావుపేటలో ఉమాదేవి డిపాజిట్లు కోల్పోయారు.


Latest News
 

నేడు రిజ్వాన్ ను వెంటబెట్టుకుని హైదరాబాదులో తనిఖీలు Sun, Sep 22, 2024, 04:14 PM
నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM