తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన వెనుకంజ

byసూర్య | Sun, Dec 03, 2023, 11:06 AM

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తొలి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 62 స్థానాల్లో కాంగ్రెస్, 42 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 8 స్థానాల్లో, ఎంఐఎం 4 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన వెనుకంజలో కొనసాగుతోంది. కూకట్పల్లిలో ఆ పార్టీ అభ్యర్థి ప్రేమకుమార్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, వైరా, నాగర్ కర్నూల్, కోదాడ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. అయితే రౌండ్లు పెరిగే కొద్ది తమ అభ్యర్థులు ఆధిక్యంలోకి వచ్చే అవకాశం ఉందని జనసేన నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్ Fri, Sep 20, 2024, 07:59 PM
హైడ్రా అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమావేశం Fri, Sep 20, 2024, 07:54 PM
కల్వకుర్తిలో భారీ వర్షం Fri, Sep 20, 2024, 07:52 PM
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ Fri, Sep 20, 2024, 07:44 PM
తిరుమల లడ్డు ప్రసాదం బాధ్యులను కఠినంగా శిక్షించాలి: ఎంపీ అరుణ Fri, Sep 20, 2024, 07:41 PM