byసూర్య | Sat, Dec 02, 2023, 08:59 AM
కోదాడ మండలం రామా లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద అంజిరెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. అంజిరెడ్డి ఇంట్లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం గ్రామంలో అంతక్రియలు నిర్వహించనున్నారు.