ఓటు వేసేందుకు పైసలు తీసుకుంటే అంత నష్టమా..,,,ఈయన మాటలు వింటే విజిల్ వేయాల్సిందే

byసూర్య | Tue, Nov 28, 2023, 08:58 PM

నిన్నటి వరకు ప్రచారాలతో హెరెత్తిన తెలంగాణ.. గడువు ముగియటంతో ప్రశాంతంగా మారిపోయింది. అటు ప్రచార పర్వం ముగిసిందో లేదో ఇటు ప్రలోభాల పర్వానికి తెరలేసింది. గుట్టుగా నగదు, మద్యం పంపకాలు జరుగుతున్నాయి. ఈ ప్రలోభాల పర్వానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా.. వాళ్ల కళ్లుగప్పి కథ నడిపిస్తున్నారు. అయితే.. ఈసారి ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీనే ఉండటంతో.. ఓటుకు డిమాండ్ కూడా అంతే స్థాయిలో పెరిగిందని టాక్ నడుస్తోంది. నామమాత్రపు పోటీ ఉన్న స్థానాల్లోనే ఓటుకు రూ.2 వేల చొప్పున డబ్బు పంచుతుంటే.. ఇక గట్టి పోటీ నడుస్తున్న నియోజకవర్గాల్లో ఎంత సమర్పించుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్.. ఈసారి గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీలు గట్టిగా ఫిక్సయ్యాయి. గెలుపు బావుటా ఎగరేసేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా పార్టీలు సిద్ధమయ్యాయని ప్రచారం జరుగుతోంది.


ఈ నేపథ్యంలో.. ఎవరెంత ఇచ్చినా తీసుకుని తమకే ఓటు వేయాలంటూ నేతలే బహిరంగంగా ప్రకటించటం గమనార్హం. అయితే.. ప్రజాస్వామ్యం కల్పించిన అతి విలువైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు డబ్బు తీసుకోవటం కరెక్ట్ కాదని.. చాలా మంది అవగాహన కల్పిస్తున్నారు. అలా తీసుకోవటం వల్ల కలిగే నష్టాలు.. కోల్పోయే గౌరవం గురించి స్వచ్ఛంద సంస్థలు, ప్రజాస్వామ్య వాదులు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. కానీ.. ఈ పంపకాలనేది ఎన్నికల్లో ఓ భాగమైపోవటం, మందులేని తెగులుగా మారటం శోచనీయం. అయితే.. డబ్బు తీసుకుని ఓటేయటం వల్ల ఎంత నష్టమో.. అసలు రాజకీయ నాయకుల తీరు.. ప్రస్తుత రాజకీయం ఎలా ఉంది.. అన్న విషయాలను.. ఓ వ్యక్తి చాలా ఆసక్తికరంగా.. కాదు కాదు.. చాలా ఆక్రోషంగా వివరించాడు. హీరో బాలకృష్ణ పూనాడా ఏంటీ అన్నట్టుగా గుక్కతిప్పుకోకుకుండా చెప్పిన ఈ డైలాగ్ వింటే.. విజిల్ వేయకుండా ఉండరంటే నమ్మండి.


ఓటు వేసుకునేందుకు వేలకు వేలు డబ్బు తీసుకంటే.. ఆ తర్వాత మా ఊరికి రోడ్డు లేదు.. రోడ్లన్ని మురికి మురికి అవుతుందని ఆ నాయకున్ని ఏ ముఖం పెట్టుకుని అడుగుతావంటూ ఓ యువకుడు తన స్నేహితులను నడి రోడ్డుపై నిలదీశాడు. ఒకవేళ అలా అడిగితే.. బుతులు తిడుతూ.. తన దగ్గర డబ్బు తీసుకుని మందు తాగి.. ఇప్పుడు ఎలా అడుగుతున్నావురా అంటూ నిలదీస్తారని ఉన్నదున్నట్టు చెప్పాడు. ఇక ప్రజాస్వామ్య భారతదేశంలో రాజకీయం చేయాలంటే ఎలా ఉండాలంటూ చెప్పిన డైలాగ్ మాత్రం వేరే లెవల్. కాక.. కొంచెం మందేసి ఉన్నాడేమో కానీ.. చాలా విలువైన విషయాలే చెప్పాడండోయ్..! నిజానికి ఈ వీడియో పాతదే అయినా.. ఈ సమయానికి సరిగ్గా సరిపోతుంది. అందుకే ఈ వీడియోను సోషల్ మీడియాలో యువత తెగ వైరల్ చేస్తుంది.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM