ఎవనికి కావలి ఇందిరమ్మ రాజ్యం?: సీఎం కేసీఆర్

byసూర్య | Tue, Nov 28, 2023, 02:04 PM

తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ ప్రజా ఆశిర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. 'పార్టీ అభ్యర్థులపై ఆలోచన చేయాలి. అంతకంటే ముఖ్యంగా వారి పార్టీల ఆలోచన విధానం, వారి దృక్పథం గురించి ఆలోచించాలి. కాంగ్రెస్ 50 ఏళ్ళ పరిపాలన చరిత్ర.. బీఆర్ఎస్ 10 ఏళ్ళ పోల్చి చూడాలి. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ అంటుంది.. ఎవనికి కావలి ఇందిరమ్మ రాజ్యం.. ఆ రాజ్యం బాగాలేకుంటేనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు అని వ్యాఖ్యానించారు.
అయితే ఈరోజు సా. 5 గంటలకు మైకులన్నీ మూగబోనున్నాయి. నెల రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించిన పార్టీ నేతలు కాస్త రిలాక్స్ కానున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 30న పోలింగ్ జరగనుండగా, ఈ 2 రోజులు పోల్ మేనేజ్మెంట్ పై గ్రామ స్థాయి నేతలు దృష్టి సారించనున్నారు. ఓటర్లను మద్యం, మనీతో ప్రలోభ పెట్టేందుకు సిద్ధం అవుతుండగా.. దీన్ని అడ్డుకోవడానికి ఈసీ అధికారులు రంగంలోకి దిగనున్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM