రాష్ట్రంలో 48 గంటల పాటు ఎస్ఎంఎస్ లపై నిషేధం

byసూర్య | Tue, Nov 28, 2023, 01:46 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గడువు ఇవాళ్టితో ముగుస్తుంది ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిశబ్ద వ్యవధిలో(సైలెన్స్‌ పీరియడ్‌లో) కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈ సమయంలో అభ్యంతరకర, రాజకీయపరమైన, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ల ప్రసారంపై ఎన్నికల అధికారులు నిషేధం విధించారు. వీటి ప్రసారాలపై నిశితంగా పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈనెల 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 48 గంటల ముందు నుంచే రాజకీయపరమైన ఎస్‌ఎంఎస్‌ల ప్రసారాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిలిపివేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు, సూచనలను ఉల్లంఘించేలా ఎస్‌ఎంఎస్‌లు పంపరాదని సూచించారు.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే విచారణ జరిపి భారత శిక్షాస్మృతి ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్‌ఎంఎస్‌లు పంపేందుకు అయ్యే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు పోలింగ్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు.


Latest News
 

రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు Fri, Sep 20, 2024, 10:48 AM
నిమజ్జన వేడుకల్లో యువకులపై దాడి Fri, Sep 20, 2024, 10:45 AM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పురోగతి Fri, Sep 20, 2024, 10:19 AM
వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM