భారీగా స్వాధీనాలు...విలువ రూ.639 కోట్ల

byసూర్య | Wed, Nov 22, 2023, 01:33 PM

అర్థశాస్త్రంలో ఓ ఫార్ములా ఉంటుంది. దాని ప్రకారం.. ఎన్నికలు ప్రతీ సంవత్సరం జరగాలట. అలా ఎందుకు అని మనకు అనిపించవచ్చు. కానీ ఆ ఫార్ములా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.ఎన్నికలు ఏటా జరిగితే.. చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. జన సమీకరణ కోసం రాజకీయ పార్టీలు భారీగా నల్లధనాన్ని ఖర్చు చేస్తాయి. తద్వారా లక్షల మంది చేతికి మనీ వస్తుంది. అంతేకాదు.. పార్టీ జెండాల కొనుగోళ్లు, సభల ఏర్పాట్లు, ప్రచారాలకు భారీగా ఖర్చు చేస్తారు. తద్వారా మనీ పెద్ద ఎత్తున ప్రజల చేతుల్లోకి వస్తుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలో మనీ ప్రవాహం (లిక్విడిటీ) పెరుగుతుంది.. అది మంచే చేస్తుందని ఆ ఫార్ములా చెబుతోంది.


ఏటా ఎన్నికలు జరిగితే.. నల్లధనం బయటకు వస్తుంది. జరగకపోతే.. పెట్టెల్లో మూలుగుతూ ఉంటుంది. అందుకే ఈ ఫార్ములాకి మంచి క్రేజ్ ఉంది. సరే.. ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకు అంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పుడు భారీగా నల్లధనం, అక్రమ బంగారం, వెండి, డ్రగ్స్, మద్యం బయటపడుతున్నాయి కదా.. నిజానికి వీటిని పోలీసులు పట్టుకోకపోతే... ఇవి సామాన్య ప్రజలకు చేరతాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే నేతలు వీటిని సప్లై చేస్తున్నారు. ఐతే.. పోలీసులు పట్టుకుంటుండటం వల్ల.. ఓటర్లకు ఇవి చేరట్లేదు. ఇలా ఈసారి ఓటర్లలో చాలా మందికి నిరాశ తప్పట్లేదు.


 


ఓటర్లను ప్రలోభ పెట్టడం చట్ట రీత్యా నేరమే. కానీ.. చాలా మంది ఓటర్లు చెప్పే మాట మరోలా ఉంది. ఇప్పుడు డబ్బులిచ్చే నేతలు.. రేపు అధికారంలోకి వచ్చాక.. భారీగా నల్లధనం కూడబెడతారనీ.. దాన్నే మళ్లీ ప్రజలకు ఎన్నికల టైమ్‌లో ఇస్తారని అంటున్నారు. తద్వారా తమ డబ్బునే ఎన్నికల టైమ్‌లో తమకు ఇస్తారనీ.. అందువల్ల ఆ డబ్బును తాము తీసుకుంటే తప్పేంటి? అనే ప్రశ్న వేస్తున్నారు. తాము తీసుకోకపోతే మాత్రం ఆ డబ్బు ప్రభుత్వానికి చేరుతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఈసారి భారీ ఎత్తున తనిఖీలు చేసి.. అక్రమాలకు చెక్ పెడుతున్నారు పోలీసు అధికారులు.ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నవాటి విలువ రూ.639 కోట్లకు చేరింది. వీటిలో నగదు, బంగారం, వెండి, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి.ఇప్పటివరకూ రూ.239 కోట్లకు పైగా మనీ దొరకగా.. అక్రమ మద్యం రూ.103 కోట్లది ఉంది. మత్తు పదార్థాల విలువ రూ.35కోట్లకు పైగా ఉండగా.. బంగారం, వెండి, వజ్రాల విలువ రూ.181 కోట్లుగా ఉంది. ఇంకా ఇతరత్రా వస్తువుల విలువ రూ.79 కోట్లుగా తేల్చారు. మరి మిగిలిన వారం రోజుల్లో ఇంకా ఎన్ని దొరుకుతాయో.


 


 


Latest News
 

ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, జాగ్రత్తగా ఉండండి Sun, Sep 22, 2024, 07:57 PM
హైదరాబాద్ శివారులో గ్రీన్ ఫార్మా సిటీ.. హైకోర్టుకు ప్రభుత్వం కీలక నివేదిక Sun, Sep 22, 2024, 07:55 PM