కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బిత్తిరి సత్తి,,,,రేవంత్ రెడ్డిపై సెటైరికల్ వీడియో

byసూర్య | Tue, Nov 21, 2023, 06:50 PM

బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కుమార్ అంటే తెలియని తెలుగు ప్రజలుండరు. అమాయకపు చేష్టలతో.. తెలంగాణ యాసకు తనదైన మాటలు కలిపి చేసే కామెడీ అంతా ఇంతా కాదు. అయితే.. బిత్తిరి సత్తి కేవలం కామెడీనే కాదు.. అందులో అంతర్లీనంగా పొలిటికల్ సెటైర్లు వేయటంలో దిట్ట. కాగా.. బిత్తిరి సత్తి తొలినాళ్లలో ఓ న్యూస్ టీవీకి సంబంధించిన పొలిటికల్ సెటైర్ కార్యక్రమంలో.. కామెడీ చేస్తూనే రాజకీయ నేతలపై వ్యాంగ్యాస్త్రాలు సంధించేవాడు. అయితే.. ఇప్పుడు సినిమాలు, ఇంటర్వ్యూలతో బిజీగా మారగా.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మళ్లీ రాజకీయ బాట పట్టాడు. ఇన్ని రోజులు ఏ పార్టీలో చేరని బిత్తిరి సత్తి.. ఇటీవలే తన మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ప్రకటించాడు. గతంలోనూ బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచార పాట పాడిన బిత్తిరి సత్తి.. ఈసారి ప్రత్యక్షంగానే మద్దతిస్తున్నాడు.


ఈ నేపథ్యంలోనే... బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ నేతలపై తనదైన శైలిలో విమర్శలు చేసూ.. ప్రజలను కారు పార్టీవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ పాల్గొంటున్న ప్రజా ఆశీర్వాద సభలతో పాటు మిగతా ప్రచార సభల్లో కూడా పాల్గొన్నంటూ.. తన ఆట పాటలతో ఆకట్టుకుంటన్నాడు. ఈ నేపథ్యంలోనే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సెటైరికల్ వీడియోను విడుదల చేశాడు. ఇందులో.. రేవంత్ రెడ్డిని పూర్తిగా దింపేశాడు బిత్తిరి సత్తి. గతంలోనూ.. చాలా మంది పొలిటికల్ పార్టీల నేతలను ఇమిటేట్ చేసే బిత్తిరి సత్తి.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన రేవంత్ రెడ్డి బిహేవియర్‌కు సంబంధించిన దృశ్యాలను రీక్రియేట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీలో యువత చేరికల సమయంలో, ఫొటోలు దిగే సమయంలో.. కోపంతో చేయి చేసుకున్న సంఘటనలతో పాటు.. ఇటీవలే స్టేజిపై నుంచి దిగుతున్న సమయంలో కార్యకర్తలను కోపంగా కాళ్లతో తన్నటం లాంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ సన్నివేశాలనే తాను సెటైరికల్‌గా రీక్రియేట్ చేయటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. దీంతో.. బీఆర్ఎస్ శ్రేణులు, రేవంత్ రెడ్డి వ్యతిరేకవర్గాలు.. ఆ వీడియోను షేర్ చేస్తున్నాయి.


ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా గట్టిగానే ప్రచారం చేస్తోంది. ఇందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను బాగా వాడుకుంటోంది. వాళ్ల ద్వారా ప్రచారం చేపిస్తూ.. వ్యూవర్స్‌ను తమ వైపు తిప్పుకునే ప్లాన్ వేసింది. అందులో భాగంగా పలు వీడియోలను రిలీజ్ చేస్తూ.. ప్రచారంలో కొత్త పంథాను ప్రారంభించింది.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM