కాంగ్రెస్ పార్టీ విజనరీ పార్టీ : మధుయాష్కీ గౌడ్

byసూర్య | Tue, Nov 21, 2023, 02:53 PM

తెలంగాణలో ఎన్నకల ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రచారానికి వారం రోజులే సమయం ఉండడంతో పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.తాజాగా టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ వినూత్నంగా ప్రచారం చేపట్టారు. సాధారణ ప్రజల్లో ఒకడిగా కలిసిపోయి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో మాట్లాడుతూ వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఐటి ప్రొఫెషనల్స్, ఇతర ఉద్యోగులతో మాట్లాడారు. మెట్రో ప్రాజెక్టు 2008లో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రారంభించిన విషయాన్ని ప్రజలకు వివరించారు. నేడు నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ విజనరీ పార్టీ అని పేర్కొన్నారు.


 


ఏ ప్రాజెక్టు రూపొందించిన భవిష్యత్ తరాలకు బ్రహ్మాండంగా ఉపయోగపడేలా కలకాలం నిలిచేలా ఉంటుందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టిన రెండేళ్లకి ప్రమాద దశకు చేరిందన్నారు. జవహర్ లాల్ నెహ్రూ హయాంలో కాంగ్రెస్ కట్టిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పటికి చెక్కుచెదరలేదని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధత అని మధు యాష్కీ స్పష్టం చేశారు.కేసీఆర్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. కమీషన్లు కాంట్రాక్టులు అంటూ తెలంగాణలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. భవిష్యత్తు తరాల నిధిని కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒకటేనని తేల్చి చెప్పారు. ప్రజలు విశ్వాసముంచి మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు.


 


 


 


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM