కేసీఆర్ భరి తెగించారు: రేవంత్ రెడ్డి

byసూర్య | Tue, Nov 21, 2023, 02:28 PM

ఇందిరమ్మ రాజ్యం అవసరమా అంటూ కేసీఆర్ భరి తెగించి మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన ప్రతీ ప్రాజెక్టు నిర్మాణం, అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యంలోనేనని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతల బతుకులు మాత్రమే మారాయని అన్నారు. అందుకే ఈసారి ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరారు.


వనపర్తి విజయభేరి సభలో మంత్రి నిరంజన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన నీళ్ల నిరంజన్ కాదు కమీషన్ల నిరంజన్ అని అన్నారు. వందల ఎకరాల్లో ఫాం హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. గుడి, బడి తేడా లేకుండా కబ్జా చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడక ముందు ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల బతుకులు ఎలా ఉన్నాయో ప్రజలు చూడాలన్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM