రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

byసూర్య | Tue, Nov 21, 2023, 11:37 AM

సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఖైరతాబాద్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ను చూసి బడికి వెళ్లే చిన్నారి కూడా తాగుడుకు బానిసగా మారిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో శాసనసభకు వెళ్లే మహిళల ప్రాధాన్యత తగ్గిపోయిందన్నారు. కాంగ్రెస్ వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.


రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. బీఆర్​ఎస్​, బీజేపీ ఎక్కుపెడుతున్న విమర్శలను తిప్పికొడుతోంది. ఈ వారం రోజుల్లో70 నియోజకవర్గాలలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రచారంలో పాల్గొననున్నారు. 25 నియోజకవర్గాలలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర నాయకత్వం ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM