![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 08:46 AM
కేంద్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు నూతనంగా హోమ్ ఓటు నమోదు ప్రక్రియ రెండు మండల కేంద్రాలలో సోమవారం అధికారులు ప్రారంభించారు. నడిచి పోలింగ్ కేంద్రానికి రాలేని వృద్ధులకు, వికలాంగులు, దివ్యాంగులకు ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు నూతనంగా హోమ్ ఓటు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం కారేపల్లి మండలంలో 49 మంది, కొనిజర్ల మండలంలో 65 మంది దరఖాస్తు చేసుకున్నారు.