'కొత్తగూడెం టికెట్‌ను అమ్ముకున్నారు'.. నారాయణ సంచలన ఆరోపణ

byసూర్య | Mon, Nov 20, 2023, 08:54 PM

తెలంగాణ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. పోలింగ్ మరో పది రోజులు మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు సాగిస్తుండగా.. బీజేపీ జనసేనతో కాంగ్రెస్ సీపీఐతో పొత్తు పెట్టుకున్నాడు. హస్తం పార్టీకి తెలంగాణ జనసమితి, వైఎస్సాఆర్‌టీపీ మద్దతు ప్రకటించారు. ఇక పలు పార్టీలో టికెట్లు రాని అభ్యర్థులు రెబల్స్‌లో పోటీలో నిలిచారు. గతంలో జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీలతో పాటు చిన్న చిన్న పొలిటికల్ పార్టీల నుంచి బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


ఇక కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించారు. అక్కడ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. అయితే కొత్తగూడెంలో ఫార్వర్డ్‌బ్లాక్‌ టికెట్‌ను ఆ పార్టీ అమ్ముకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. డబ్బులు తీసుకొని జలగం వెంకట్రావుకు బీ-ఫాం ఇచ్చారని ఆయన ఆరోపించారు. వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ అయిన ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ సీపీఐ అభ్యర్థి ఉన్న చోట్ల టికెట్‌ను కేటాయించాన్ని ఎలా చూడాలని ఆయన ప్రశ్నించారు.


తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని అన్నారు. వీరిని ఈ ఎన్నికలలో ఓడించాలని ప్రజలకు నారాయణ పిలుపునిచ్చారు. గోషామహల్‌ భాజపా అభ్యర్థి రాజాసింగ్‌పై మజ్లిస్‌ అభ్యర్థిని పెట్టలేదని.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ మైనార్టీ అభ్యర్థిపై మాత్రం పోటీకి దిగిందని అన్నారు. ఆ మూడు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందానికి ఇవే నిదర్శనమని అన్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.


కాగా, బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ జలగం వెంకట్రావు ఈసారి రెబల్‌గా పోటీ చేస్తు్న్నారు. ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ నుంచి ఆయన బరిలో నిలిచారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా కుటుంబంపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం ఆయనకు సపోర్ట్ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొత్తగూడెంలో ఈసారి బీఆర్ఎస్, సీపీఐ, జలగం వెంకట్రావు మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అంటున్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM