ఆత్మహత్యలు, నిరుద్యోగం లో దేశంలోనే అగ్రస్థానం: రేవంత్ రెడ్డి

byసూర్య | Mon, Nov 20, 2023, 03:31 PM

రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. నర్సాపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కుటుంబానికి తప్ప ఎవరికీ ప్రయోజనం కలగలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరికీ న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగులు, రైతులను మోసం చేశారని విమర్శించారు.


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్‌లో బహిరంగ సభ, మధ్యాహ్నం 3 గంటలకు పరకాలలో బహిరంగ సభ, సాయంత్రం 6 గంటలకు ఖైరతాబాద్‌లో రోడ్‌షో, రాత్రి 8 గంటలకు నాంపల్లిలో రోడ్‌షోలో పాల్గొని. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. మరోవైపు రేపటి నుంచి ఆ పార్టీ జాతీయ స్థాయి నేతలు ప్రచారానికి తరలిరానున్నారు.


Latest News
 

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన పాలకుర్తి కాంగ్రెస్ నేతలు Sat, Dec 09, 2023, 10:16 AM
ఆలేరు ఎమ్మెల్యేని సన్మానించిన అధికారులు Sat, Dec 09, 2023, 10:07 AM
రహదారుల వెంట వ్యర్థ పదార్థాలు వేయరాదు Sat, Dec 09, 2023, 10:04 AM
నల్ల పోచమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు Sat, Dec 09, 2023, 09:57 AM
రేపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్న కిషన్ రెడ్డి Fri, Dec 08, 2023, 11:03 PM