byసూర్య | Mon, Nov 20, 2023, 03:09 PM
సిరికొండ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన శీతల్(17) కొన్ని రోజుల నుంచి పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతోంది. తీవ్రత ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందింది. ఈ క్రమంలో శనివారం బహిర్భూమికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. గ్రామానికి సమీపంలో పురుగుమందు తాగి వాంతులు చేసుకోవడంతో స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.