హైదరాబాద్‌లో బయటపడిన మరో ఫేక్ డాక్టర్ బండారం,,,చేతబడి చేశారంటూ బాధితులతో క్షుద్రపూజలు

byసూర్య | Sun, Sep 24, 2023, 06:53 PM

అదేంటో.. ఆరోగ్యం కోసం తాజా కూరగాయల అమ్మే రైతుల దగ్గర ఎన్నో ప్రశ్నలు వేసి బేరాలాడుతుంటాం.. కానీ కొంచెం అనారోగ్యంగా ఉందంటే ఎవ్వరూ ఏం చెప్పినా నమ్మేసి.. వాళ్లు నిజమైన డాక్టర్లు అవునా కాదా అని కూడా తెలుసుకోకుండా.. వెళ్లి లక్షలు లక్షలు పెట్టేస్తుంటాం. అంతేనా.. కొన్నిసార్లయితే విజ్ఞతను వదిలేసి మరీ మూఢనమ్మకాలతో మత్తులో మునిగిపోయి.. సర్వం సమర్పించేసుకుంటాం. అయితే.. దీనంతటికీ కారణం.. మనలోని ఆ అతి జాగ్రత్త, భయం, అమాయకత్వమే. వాటిని ఆసరాగా చేసుకునే.. కొందరు నకిలీ బాబాలు, ఫేక్ డాక్టర్లు పుట్టుకొస్తున్నారు. అలాంటి ఓ ఫేక్ ఆయుర్వేద వైద్యుడి బాగోతం బయటపడింది. ఆయుర్వేద వైద్యం పేరుతో.. క్షుద్రపూజలు చేస్తున్నట్టు తేలింది.


హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఎస్వోటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించగా.. ఫేక్ డాక్టర్ బండారం బయటపడింది. నార్త్ ఇండియాకు చెందిన జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి.. ఆయుర్వేద వైద్యునిగా చలామణి అవుతున్నాడు. రెండు సంవత్సరాలుగా GNR ఆయుర్వేదం పేరుతో హస్పిటల్ నడిపిస్తున్నాడు. వైద్యం కోసం వచ్చిన వారికి చేతబడి చేశారంటూ వారి చేత క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నాడు. సోదాలు నిర్వహించిన పోలీసులు.. భారీగా పూజ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజ్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. వాట్సప్ కాల్ లిస్ట్, మెస్సేజ్ ఛాటింగ్‌లో కీలక విషయాలు వెలుగుచూసే అవకాశమున్నట్టు పోలీసులు అంచనావేస్తున్నారు. కాగా.. ఈ ఫేక్ డాక్టర్ బాధితుల లిస్టులో పలువురు వీఐపీలు కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం Sat, Oct 26, 2024, 11:00 AM
తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 10:57 AM
నేడు, రేపు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రద్దు Sat, Oct 26, 2024, 10:13 AM
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM