ఆ విషయంలో లండన్, న్యూయార్క్ కంటే హైదరాబాదే ముందు,,,సగటున 1.6 చ. కి.మీ.లో 321 కెమెరాలతో నిఘా

byసూర్య | Sun, Sep 24, 2023, 06:21 PM

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. అనేక అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో నగంరంలో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రహదారులు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలతో పాటు సెక్యూరిటీ పరంగా కూడా ప్రత్యేకంగా చర్యలు చేపడుతోంది. మౌలికవసతుల పరంగా దేశంలోని అనేక నగరాల కంటే హైదరాబాద్ ముందు వరసలో ఉంది. నగరాన్ని దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం మరో ఘనతను సొంతం చేసుకుంది.


దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగిన రెండో నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తొలి 50 నగరాల జాబితాలో నగరం 41వ స్థానంలో నిలిచింది. ఈ అంశంలో లండన్, న్యూయార్క్ వంటి నగరాలను హైదరాబాద్ వెనక్కి నెట్టింది. అత్యుత్తమ సర్వేలైన్స్‌ వ్యవస్థను కలిగిన తొలి 20 జాబితాలో చైనాలోని పలు నగరాలు నిలిచాయి. ఉత్తమ 50 నగరాల్లో భారత్‌ నుంచి ఢిల్లీ 22వ స్థానంతో నిలవగా.. ఆ తర్వాత హైదరాబాద్‌ 41వ స్థానంలో నిలిచింది.


జనాభా, సీసీ కెమెరాలు, నగర విస్తీర్ణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ సంస్థ ఓ అధ్యయన చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థను కలిగిన నగరాల జాబితాను రూపొందించింది. అందులో హైదరాబాద్ 41వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ నగరంలో ప్రతి 1.6 చదరపు కిలోమీటర్ల పరిధిలో 321 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక ఢిల్లీలో 1,490 కెమెరాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం సీసీ కెమెరాల్లో 62 శాతం ఒక్క హైదరాబాద్ నగరంలో ఉన్నట్లు తేలింది. నగరం వ్యాప్తంగా సుమారు 5 లక్షల సీసీ కెమెరాలను ఇప్పటివరకు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ, పర్యవేక్షణ, మరమ్మత్తుల కోసం క్యామో (కెమెరా మెయింటెనెన్స్‌ ఆర్గనైజేషన్‌) విభాగాన్ని ఏర్పాటు చేసి నగరంలో సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ తర్వాత మాస్కో, న్యూయార్క్‌, మెక్సికో, బ్యాంకాక్‌, లండన్‌, ఢాకా, లాస్‌ ఏంజిల్స్‌, బెర్లిన్‌, జోహెన్స్‌ బర్గ్‌, ప్యారిస్‌, సిడ్నీ, ఇస్తాంబుల్‌ వంటి నగరాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో 54 శాతం సీసీ కెమెరాలు ఒక్క చైనాలోనే ఉండగా.. మిగిలిన 46 శాతం కెమెరాలు 150 కిపైగా దేశాలు కలిగి ఉన్నట్టుగా సర్వే రిపోర్టులో వెల్లడైంది.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM