నారాయణగూడలో గణపతి చేతిలో బంగారు లడ్డు,,,,తులం బంగారంతో ప్రత్యేకంగా తయారీ

byసూర్య | Sat, Sep 23, 2023, 07:02 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ మండపాలు ఎంత ఫేమస్సో.. గణపతి చేతిలోని లడ్డూ కూడా అంతే ఫేమస్. చాలా ప్రాంతాల్లో లక్షల్లో వేలం పాడి గణపతి చేతిలో నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూను సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీ పడుతూ ఉంటారు. అందుకోసం ప్రత్యేకంగా లడ్డూలనూ తయారు చేయిస్తూ ఉంటారు. కొందరు వందల కిలోలతో లడ్డూను తయారు చేయిస్తుండగా.. మరికొందరు డ్రైప్రూట్స్, ప్రత్యేక పదార్థాలతో లడ్డూలను తయారు చేయించి గణనాథుడి చేతిలో పెడుతూ ఉంటారు. హైదరాబాద్ నారాయణగూడలో మాత్రం గణపయ్యకు బంగారంతో లడ్డూ తయారు చేయించారు. పసిడితో ఆకర్షణీయంగా బంగారు లడ్డూ చేయించి గణపతి చేతిలో ఉంచారు. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడ స్టీట్ నంబర్ 5లో జై శ్రీ గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.


ఈ ఏడాది కూడా మండపం ఏర్పాటు చేసి గణనాథుడినికి పూజులు చేస్తున్నారు. అయితే ఈసారి కాస్త విభిన్నంగా గణపయ్య చేతిలో బంగారు లడ్డు పెట్టారు. తులం బంగారంతో ప్రత్యేకంగా లడ్డూను తయారు చేసి గణనాథుడి చేతిలో ఉంచారు. గత 24 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మండపం నిర్వాహకులు అనీష్ గంగపుత్ర, నర్సింగ్ గౌడ్ తెలిపారు. బంగారు లడ్డు విలువ రూ.60 వేలకు పైగా ఉంటుందని వెల్లడించారు. ఉత్సవాల చివరి రోజు గణపతి చేతిలోని 15 కిలోల లడ్డుతో పాటు ఈ బంగారు లడ్డూను వేలం వేయనున్నట్లు వారు వెల్లడించారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM