క్యాడర్ కోసం ప్రాణత్యానికైనా సిద్ధమే,,,,,మల్కాజిగిరి నుంచే పోటీ చేస్తా

byసూర్య | Sat, Sep 23, 2023, 06:54 PM

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతూ.. ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీలు మారుతూ.. టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారిపోతున్నారు. తాజాగా.. మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉన్నప్పటికీ.. తన కుమారునికి టికెట్ కేటాయించకపోవటంతో తీవ్ర అసంతృప్తికి లోనైన మైనంపల్లి.. గత కొంత కాలంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. పార్టీ మారటం గురించి తన అనుచరులతో సమావేశాలు కూడా నిర్వహించి.. ఎట్టకేలకు నిన్న (సెప్టెంబర్ 22) రాత్రి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్తలతో పాటు.. పోటీ చేసే స్థానాలపై రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ వార్తలపై మైనంపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.


మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని మైనంపల్లి స్పష్టం చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నానంటూ రూమర్స్ పుట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. మల్కాజిగిరి ప్రజలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. చెప్పుకొచ్చారు. 74 వేల మెజార్టీతో గెలిపించినట్టు తెలిపిన మైనంపల్లి.. మళ్లీ అక్కడి నుంచి పోటీ చేస్తానని ఉద్ఘాటించారు. తమకు పదవులు ముఖ్యం కాదని.. కార్యకర్తలే ముఖ్యమని మైనంపల్లి ఉద్ఘాటించారు. అవసరమైతే కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని మైనంపల్లి వెల్లడించారు. 6 వేల మంది కార్యకర్తలు రోడ్డు మీదికి వచ్చారని.. వాళ్లపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని సర్వేల్లో తామే నెంబర్ వన్‍గా ఉన్నామని మైనంపల్లి చెప్పుకొచ్చారు. ఈసారి కూడా విజయం మాదేనంటూ.. ధీమా వ్యక్తం చేశారు.


ఈ క్రమంలో.. బీఆర్ఎస్ కీలక నేతలపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు మైనంపల్లి. పేర్లు తీయను కానీ.. నియోజకవర్గానికి కూడా రాకుండా తండ్రీకొడుకులను ఓడిస్తామంటూ కొందరు సవాల్ చేస్తున్నారన్న మైనంపల్లి.. సత్తా చూపిస్తామంటూ ఛాలెంజ్ విసిరారు. తన కుమారున్ని చూసి.. కేసీఆరే రాజకీయాల్లోకి తీసుకురమ్మన్నారని తెలిపారు. మంచి నాయకున్ని చేద్దామని చెప్పటం వల్లే తన కుమారుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు వివరించారు. మెడిసిన్ తర్వాత.. ఎంబీఏ కూడా చేయకుండా.. సేవా కార్యక్రమాలలో నిమగ్నమైనట్టు తన కుమారుని గురించి చెప్పుకొచ్చారు మైనంపల్లి.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM