తెలంగాణలో సెప్టెంబర్ 30న ప్రధాని మోదీ పర్యటన,,,,మహబూబ్‌నగర్‌కు రాక

byసూర్య | Sat, Sep 23, 2023, 06:19 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున తరచూ సీఎం కేసీఆర్.. జిల్లాల్లో పర్యటిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూనే ఉన్నారు. కాగా.. కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. సీడబ్యూసీ మీటింగ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించటమే కాకుండా.. అగ్రనేతలంతా కలిసి తుక్కుగూడాలో ఆరు గ్యారంటీలను ప్రకటించి.. ఎన్నికలకు శంఖారావం పూరించారు. ఇఖ మిగిలింది బీజేపీనే. కాగా.. కమలం పార్టీ తరపున ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే రంగంలోకి దిగుతున్నారు.


తెలంగాణలో నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. కాగా.. అక్టోబర్ మొదటి వారంలో (3 లేదా 4 లేదా 5 తేదీల్లో) ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు షెడ్యూల్ కొంచెం ముందుకు జరిగింది. ప్రధాని మోదీ.. సెప్టెంబర్ 30వ తేదీనే తెలంగాణలో పర్యటించనున్నట్టు బీజేపీ వర్గాలు ప్రకటించారు. మహబూబ్‌నగర్‌‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. టౌన్‌షిప్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో హాజరుకానున్నారు. 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ సభకు చేరుకోనున్నారు.


ప్రధాని మోదీ సభకు బీజేపీ వర్గాలు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఎన్నికలు దగ్గరపడిన వేళ.. ప్రధాని మోదీ పాల్గొంటున్న సభను 2023 ఎన్నికల శంఖారావం సభగా బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు.. లక్ష మందికి పైగా జనసమీకరణ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నేతలు జితేందర్ రెడ్డి, ఆచారి పర్యవేక్షించనున్నారు.


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి బీజేపీ జెండా ఎగురవేయాలని కమలనాథులు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రధాని మోదీ సభ శ్రేణుల్లో మంచి బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. పలుమార్లు తెలంగాణలో పర్యటిస్తూ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ సభతో.. బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయనుందన్న సంకేతాలు పంపిస్తున్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM