ఘనంగా ఊరూరా చెరువుల పండుగ

byసూర్య | Thu, Jun 08, 2023, 03:16 PM

నేరేడిగొండ మండలం రాజుర గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జడ్పిటిసి అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణతో చెరువుల కింద ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా అందుతుందన్నారు. భారతదేశంలో కొన్నిచోట్ల భూగర్భ జలాలు అడుగంటుకపోతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేప, రొయ్య పిల్లల పెంపకాన్ని చేపట్టి, వాటిపై హక్కులను మత్స్యకారులకే కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనుసా వసంత్ రావ్, సవైరామ్, సంధ్య, ఐకెపీ సీసీ విజయ, డైరెక్టర్ రామచందర్, ఉప సర్పంచ్ దేవేంధర్ రెడ్డి, గణేష్, కాశిరామ్, శివాజీమాజీ ఎంపీపీ గణేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM