టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు

byసూర్య | Thu, Jun 01, 2023, 07:54 PM

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ తన ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు చేసినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి ఉద్యోగులకు డీఏ చెల్లించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలో ఉద్యోగులకు ప్రకటించనున్నట్లు తెలిపారు.Latest News
 

డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి Sat, Sep 30, 2023, 03:45 PM
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : మంత్రి మల్లారెడ్డి Sat, Sep 30, 2023, 03:42 PM
సమ్మెకు కదలిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు Sat, Sep 30, 2023, 03:41 PM
కాంగ్రెస్ పై మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు Sat, Sep 30, 2023, 03:31 PM
రేషన్ కార్డు దారులకు ముఖ్య గమనిక Sat, Sep 30, 2023, 03:27 PM