మెరుగైన ప్రయాణం కోసం టీఎస్ ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు,,,ఈనెల 27న ప్రారంభం

byసూర్య | Sat, Mar 25, 2023, 07:33 PM

తాజాగా.. ప్రయాణికులకు టీఎఎస్ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు గాను.. ఏసీ స్లీపర్ బస్సలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 16 ఏసీ స్లీపర్ బస్సులను కోనుగోలు చేశారు. వీటిని ఈనెల 27న ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బళ్లి, తమిళనాడులోని చెన్నై నగరాలకు ఈ బస్సులను నడిపించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.


తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రస్తుతానికి ఏసీ స్లీపర్ బస్సులు లేవు. కొంత కాలం క్రితం 'లహరి' పేరుతో నాన్ ఎసీలో 12 స్లీపర్, హెబ్రిడ్ బస్సులను తీసుకొచ్చింది. ఈ బస్సులను అద్దె ప్రతిపాదికను తీసుకున్న టీఎస్ ఆర్టీసీ విజయవాడ, కాకినాడ వంటి నగరాలకు మాత్రమే నడుపోతుంది. రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, బెంగళూరు వంటి నగరాలకు 'వెన్నెల' పేరుతో ఏసీ స్లీపర్ బస్సులను నడిపించారు. ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి టీఎస్‍‌ఆర్టీసీ విడిపోయాక ఏసీ స్లీపర్ బస్సులను నడిపించలేదు.


ఇదే సమయంలో ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు వందల సంఖ్యలో ఏసీ స్లీపర్ బస్సులను నడిపించి సొమ్ము చేసుకుంటున్నారు. నిద్ర పోయేందుకు బెర్తులు ఉండటంతోపాటు ప్రయాణం సుఖవంతంగా ఉండటంతో ఈ బస్సులకు ఆదరణ పెరిగింది. ఈ అవకాశాన్ని ఆలస్యంగా గుర్తించిన టీఎస్ ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులను నడిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అశోక్‌ లైలాండ్‌ కంపెనీ నుంచి ఏసీ స్లీపర్‌ బస్సులను కొనుగోలు చేసింది. ఒక్కో బస్సుకు రూ.55 లక్షలు వెచ్చించి.. ఇప్పటికే 4 బస్సులు కొనుగోలు చేశారు. మరో నాలుగు బస్సులు ఇవాళ టీఎస్ ఆర్టీసీకి చేరనుండగా.. మిగిలినవి నెలాఖరుకు రానున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.


ఆర్టీసీ అధికారుల నిర్ణయంతో దూరు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ బస్సుల్లో తక్కువ ఛార్జీలతో సురక్షితమైన ప్రయాణం చేయవచ్చునని చెబుతున్నారు.



Latest News
 

వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM