మెకానిక్ షెడ్డులో చెలరేగిన మంటలు,,,అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం

byసూర్య | Sat, Mar 25, 2023, 07:32 PM

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కారు గ్యారేజీలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడు కార్లు పూర్తిగా దగ్ధమవ్వగా.. సెక్యూరిటీ గార్డు సంతోష్ సజీవ దహనమయ్యాడు. మంటలు అంటుకున్న సమయంలో అతడు కారులో నిద్రిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కారులోనే సజీవ దహనమైనట్లు చెబుతున్నారు. సంతోష్ మృతితో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.


బొగ్గులకుంట కామినేని హాస్పిటల్ పక్కన ఉన్న మెకానిక్ షెడ్డులో ఈ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి ఒక్కసారిగా షెడ్డు మొత్తానికి అంటుకున్నాయి. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలకు దట్టమైన పొగలు అలుముకుని చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. అలాగే భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానిక ప్రజలు రాత్రి సమయంలో భయభ్రాంతులకు గురయ్యారు. పొగలు దట్టంగా వ్యాపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.


దీనిపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అలాగే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు.


అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏంటనేది గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు ఏడు కార్లు దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. సంతోష్ గత కొంతకాలంగా కారు గ్యారేజీలోనే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు అబిడ్స్ సీఐ ప్రసాద్ చెప్పారు. కారులో మంటలు చెలరేగడం వల్ల ప్రమాదం జరిగిందని, సెక్యూరిటీ గార్డు నిద్రిస్తున్న కారులో మంటలు వచ్చినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత మంటలు షెడ్డు మొత్తానికి వ్యాపించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


అయితే ఇటీవల హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తోన్నాయి. ఇటీవల సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. మృతులంతా క్యూనెట్ ఏజెంట్లుగా అధికారులు గుర్తించారు. అంతకుముందు సికింద్రాబాద్‌లోని దక్కన్ మాల్‌లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవదహనమయ్యారు. ఇవి మరువకముందే నగరంలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి. దీంతో వరుస అగ్నిప్రమాదాలు నగరవాసులను భయపెడుతున్నాయి.


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM