ఎమ్మెల్యే గణేష్ గుప్తా కాన్వాయ్‌కు ప్రమాదం,,,సెక్యూరిటీ సిబ్బందికి స్వల్వ గాయాలు

byసూర్య | Sun, Mar 19, 2023, 06:34 PM

నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో.. కామారెడ్డి జాతీయ రహదారిపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సిబ్బంది కారు ముందుగా వెళ్తున్న మరో కారును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. అయితే.. ఈ ప్రమాదంలో గణేష్ గుప్తాకు చెందిన సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా.. వారిని చికిత్స నిమిత్తం వెంటనే నిజామాబాద్‌కు తరలించారు. అయితే.. ఎమ్మెల్యే గణేష్ గుప్తా కారుకు.. సెక్యూరిటీ కారుకు మధ్యలో ఇంకో కారు రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు వివరాలు తెలుసుకుంటున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి.Latest News
 

పెరుగుతున్న యాదాద్రి ఆలయ ఆదాయం Wed, Mar 29, 2023, 09:12 PM
వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:57 PM
టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన Wed, Mar 29, 2023, 08:44 PM
మోసగాడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు Wed, Mar 29, 2023, 08:43 PM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ ఆవిర్భావ సభ Wed, Mar 29, 2023, 08:42 PM