కూతురి పెళ్లి తెల్లారే ,,,గుండెపోటుతో కుప్పకూలిన తల్లి

byసూర్య | Sun, Mar 19, 2023, 06:33 PM

గుండె  పోటు ఆ వయస్సు..ఈ వయస్సు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కర్నీ కాటేస్తోంది. ఇటీవల ఈ కేసులు తెలంగాణలో బాగా పెరిగిపోతున్నాయి. ఇదిలావుంటే  విధి ఎంత కఠినమైనదో.. సంతోషాన్ని ఆస్వాధించేలోపే.. విషాదంతో అమాంతం ముంచేస్తుంది. అదే జరిగింది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బంజార గ్రామంలో. పెళ్లింట విషాదం నిండింది. కూతురు పెళ్లి చేసిన తెల్లారే గుండెపోటుతో తల్లి మృతి చెందింది. బంజార గ్రామానికి చెందిన 35 ఏళ్ల జగిలి స్వరూపకు ముగ్గురు కూతుళ్లు. అందులో పెద్ద కూతురు వివాహం శుక్రవారం(మార్చి 19న) జరిగింది. ఎంతో ఆనందంగా కన్యాదానం చేసింది స్వరూప. పెళ్లి ఘనంగా జరిపారు. ఇళ్లంతా సంతోషంతో నిండిపోయింది. అక్కడే విధికి కన్నుకుట్టిందేమో.. తీరని విషాదాన్ని వాళ్లకు మిగిల్చింది.


శనివారం ఉదయం కూతురి అత్తగారింటికి వెళ్లేందుకు అంతా సిద్ధమవుతున్నారు. అందరూ హడావిడిగా ఉన్నారు. అంతలోనే సర్వూప ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏమైందా అని దగ్గరికి వెళ్లి చూసేసరికే.. శ్వాస కోల్పోయింది. హుటాహుటిన వైద్యుని దగ్గరికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించిందని తెలిపాడు. దీంతో.. పెళ్లింట రోధనలు మిన్నంటాయి. అప్పటివరకు పెళ్లిబాజాలు మోగిన ఇంట.. చావు డబ్బు మోగింది. పెద్దకూతురికి కన్యాదానం చేసిన తర్వాతి రోజే.. చిన్నకూతురితో తలకొరివి పెట్టించుకుందంటూ కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు అందరి గుండెల్ని పిండేసింది.Latest News
 

పెరుగుతున్న యాదాద్రి ఆలయ ఆదాయం Wed, Mar 29, 2023, 09:12 PM
వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:57 PM
టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన Wed, Mar 29, 2023, 08:44 PM
మోసగాడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు Wed, Mar 29, 2023, 08:43 PM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ ఆవిర్భావ సభ Wed, Mar 29, 2023, 08:42 PM