అన్నతో కలసి ఢిల్లీ పయనమైన ఎమ్మెల్సీ కవితా

byసూర్య | Sun, Mar 19, 2023, 06:32 PM

ఈడీ నోటీసులతో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితా తన అన్న మంత్రి కేటీఆర్ తో కలసి ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు (మార్చి 20) ఢిల్లీలో ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, సోదరుడు కేటీఆర్ తో కలిసి కవిత ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలి వెళ్లారు. వారి వెంట బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. ఇదిలావుంటే మహిళను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపటి ఈడీ విచారణకు ఆమె వ్యక్తిగతంగా హాజరవుతారా, లేక తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అటు, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది.Latest News
 

సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ Thu, Feb 29, 2024, 04:24 PM
నిత్యం ప్రజలకు అందుబాటులో Thu, Feb 29, 2024, 03:32 PM
'ధరణి' బాధితులకు గుడ్‌న్యూస్ Thu, Feb 29, 2024, 03:07 PM
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర Thu, Feb 29, 2024, 03:07 PM
శివాలయం భూమి పూజలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే Thu, Feb 29, 2024, 03:06 PM