ఇంటి తలుపులు, సామాగ్రినినే కాదు...ల్యాప్‌టాప్, బైక్ తీసుకెళ్లిన బ్యాంకు సిబ్బంది

byసూర్య | Sun, Mar 19, 2023, 03:33 PM

లోన్ కట్టని వారి నుంచి ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకు అధికార్లు తాజాగా అప్పు చెల్లించలేదని రైతుల ఇంటి తలుపులతో పాటు ఇంట్లోని బైక్, ల్యాప్‌టాప్ తీసుకెళ్లారు. అలాగే ఇంట్లోని సామాగ్రిని కూడా ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్సుల్లాబాద్ మండలం అంకోల్‌కు చెందిన చంచు హన్మాండ్లు దుర్కి, పసుపుల లక్ష్మణ్, పసుపుల సాయయ్య అనే రైతులు స్థానిక సహకార కేంద్ర బ్యాంకులో లోన్లు తీసుకున్నారు. చంచు హన్మాండ్లు అనే రైతు రూ.5 లక్షల రుణం తీసుకోగా.. ఈఎంఐ రూపంలో చెల్లిస్తూ వస్తున్నాడు.


అయితే మరో 6 వాయిదాలు చెల్లించాల్సి ఉండగా.. గత కొంతకాలంగా టైమ్‌కు కట్టడం లేదని తెలుస్తోంది. దీంతో హన్మాండ్లు ఇంటికి వచ్చిన బ్యాంకు అధికారులు, సిబ్బం..ది లోన్ కట్టాల్సిందిగా ఆయనపై ఒత్తిడి తెచ్చారు. తన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని, త్వరలో కడతానంటూ అధికారులను వేడుకున్నాడు. అయినా వినిపించుకోని సిబ్బంది.. ఇంటి తలుపులు తొలగించారు. అలాగే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చాలాసేపు వేడుకోగా తలుపులు, సామాగ్రి తిరిగి ఇచ్చేశారు. మంగళవారం వరకు టైమ్ ఇస్తున్నామని, కట్టకపోతే తలుపులు, సామాన్లు అన్నీ తీసుకెళ్లతామని హెచ్చరించి వెళ్లారు.


ఇక పసుపుల సాయయ్య అనే రైతు ఇంట్లో ఆయన కుమారుడికి చెందిన బైక్‌ను కూడా స్వాధీనం చేశారు. అలాగే పసుపుల లక్ష్మణ్ ఇంట్లో ఆయన కుమారుడి ల్యాప్‌టాప్‌ను తీసుకున్నారు. అయితే గంట తర్వాత ఒకరు రూ.50 వేలు, మరొక రైతు రూ.20 వేలు చెల్లించడంతో ల్యాప్‌టాప్, బైక్ తిరిగి ఇచ్చేశారు. లోన్లు చెల్లించడంలేదని బ్యాంకు అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. రైతుల ఇళ్లల్లోని తలుపులు, సామాన్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇటీవల కూడా ఓ రైతు ఇంట్లో తలుపులు, సామాన్లు తీసుకెళ్లారు.



Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM